చెన్నూరులో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

★మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26 మంచిర్యాల్ జిల్లా ప్రతినిధి లింగంపల్లి మహేష్, మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించ బడ్డాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనులు, ఉపాధి శాఖామంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించిందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, దేశాభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు, యువత, పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని, చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా కొనసాగాయి.