ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్: జనవరి 27 పెద్దకడబురు, మంత్రాలయం తాలూకా కర్నూల్ జిల్లా, రిపోర్టర్ గుడిసె శివరాజ్ : గణతంత్ర దినోత్సవ వేడుకలను పెద్దకడబురు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ పాఠశాలల వద్ద ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ లో రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, కస్తూరిబా పాఠశాలలో కర్నూలు జిల్లా టిడిపి అధికార ప్రతినిధి శశిరేఖ, తాసిల్దార్ కార్యాలయంలో గీత ప్రియదర్శిని, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ శ్రీవిద్య, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి సుచరిత్ర, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై నిరంజన్ రెడ్డి , జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలు చేశారు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అవతరణ సందర్బంగా యావత్ భారత ప్రజలు గణతంత్ర వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మీసేవ ఆంజనేయ, మల్లికార్జున, భాష, పెద్ద హనుమంతు, ఆర్ ఐ జెర్మియా, వీఆర్వోలు నారాయణరెడ్డి, విక్రమ్ రెడ్డి, నరసన్న, తదితరులు పాల్గొన్నారు.