ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జెండా ఎగరవేసిన కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ

సాక్షి డిజిటల్ న్యూస్ - జనవరి 27 - సికింద్రాబాద్ - గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీతాఫలమండి డివిజన్ పరిధిలోనీ నాగులూరి పార్క్, బీదల బస్తీ, టి.అర్.టి క్వాటర్స్, వారసిగూడ, మహ్మద్ గూడ, ఇందిరానగర్, మధురానగర్, ఉప్పర్ బస్తీ, పలు సంఘాల ఆహ్వానం మేరకు పలు చోట్ల కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ సామల హేమ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశానికి పునాది అని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రతి పౌరుడు గౌరవించాలని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధమైన హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. సమాజ అభివృద్ధిలో ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తి ఎంతో కీలకమని, యువత విద్యతో పాటు నైతిక విలువలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.