సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి, 26, 2026 (రిపోర్టర్ ఇమామ్ ), గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మరికల్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల ఆధ్వర్యంలో సోమవారం నాడు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మరికల్ పోలీస్ స్టేషన్ సిఐ కార్యాలయంలో సిఐ భగవంతు రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అదేవిధంగా మరికల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మరికల్ ఎస్సై రాములు ఆధ్వర్యం లో జాతీయ జెండాను ఎగరవేశారు. మరికల్ యూవక మండలి కార్యాలయం వద్ద అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేశారు. అదేవిధంగా మరికల్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద మండల తాసిల్దార్ రామకోటి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అదేవిధంగా మండల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో పృథ్విరాజ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేశారు. తలయం వద్ద గంత పాలకుడు మల్లికార్జున ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేశారు. అదేవిధంగా మరికల్ మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో జాతీయ జెండాలను అధికారులు ఎగరవేశారు. మరికల్ సిఐ కార్యాలయం వద్ద విద్యార్థులకు నోటు పుస్తకాలను పెన్నులను మరికల్ సీఐ భగవంతు రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. మరికల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీలు, ముగ్గుల పోటీలో విజయం సాధించిన వారికి బహుమతులను మండల ఎంపీడీవో పృథ్విరాజ్ అద్వార్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మరికల్ గ్రామ సర్పంచ్ చెన్నయ్య, ఉప సర్పంచ్ కాజా వార్డు సభ్యులు, అఖిలపక్ష నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
