సాక్షి డిజిటల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి మహమ్మద్ నయీమ్ జనవరి 26 77 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా, కామారెడ్డి లో గల ప్రతిభ హై స్కూల్ నందు జరిగిన వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, దేశ సార్వభౌమత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా సాయుధ బలగాల వేశాధరణ, అలాగే వివిధ రకాల వస్త్రలంకరణ తో పాటు, పాఠశాల ఆవరణలో జరిగిన వేడుకలలో భాగంగా జరిగిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా, పాఠశాల కరస్పాండెంట్ రమేష్ మాట్లాడుతూ, విద్యాభ్యాసం యొక్క అవసరాన్ని, ఈ దేశ అభవృద్ధి లో విద్యార్థుల పాత్ర ని, మరియు విలువలు కలిగిన విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సైనికాధికారుల వేషధారణ లో కనిపించిన పిల్లలు అందరినీ ఆకట్టుకున్నారు.