ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

సాక్షి, డిజిటల్ న్యూస్ జనవరి 26, శంకరపట్నం,, కరీంనగర్ జిల్లా,, రాజు జర్నలిస్టు,,!! శంకరపట్నం మండలంలో ప్రభుత్వ పాఠశాలల, ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి, ఈ సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి సంబరాలు జరిపారు, తాసిల్దార్ సురేఖ, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్రవణ్ కుమార్, స్థానిక వ్యవసాయ ఉపమార్కెట్ ఆవరణములో వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేశారు,, ప్రభుత్వ పాఠశాలలపై ప్రధానోపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలలపై ఉపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు,, వంకాయ గూడెం గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నేత రౌతు కొమురయ్య జాతీయ జెండాను ఎగరవే, చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు, వేరువేరుగా జరిగిన కార్యక్రమాలలో అధికారులు, రాజకీయ పక్షాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.