ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన మహమ్మద్ అలీ షబ్బీర్…

సాక్షి డిజిటల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి మహమ్మద్ నయీమ్ జనవరి 26, ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు: తన నివాసంలో భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో గల తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ​ఈ వేడుకలో ఆయన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన జాతీయ గీతానికి వందనం సమర్పించి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు.
​ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ ​ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగమే దిక్సూచి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లనే నేడు ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ లభిస్తున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుంటూ, దేశ సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాన అన్నారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్ ఆలీ కుటుంబ సభ్యులు మరియు ఇతర ముఖ్య అనుచరులు పాల్గొన్నారు.