సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి,26, (రిపోర్టర్ తిరుపతి ), గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రాంపల్లి గ్రామం లో గ్రామ సర్పంచ్ బొమ్మ మల్లయ్య మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో సోమవారంగ్రామ పంచాయతీ ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేశారు . అనంతరం అంగన్వాడీ కేంద్రం లో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సర్పంచ్ పిల్లలకు మరియు బాలింత లకు గ్లాస్ లు మరియు ప్లేట్ పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లోఅంగన్వాడీ టీచర్ కవిత,, ఉప సర్పంచ్ మాధవి సుధాకర్, మరియు పంచాయతీ కార్యదర్శి అనిల్, మరియు వార్డు బొమ్మ స్వామి,దారం రజిని సంపత్ రెడ్డి, వుండేం స్వప్న మహిపాల్ రెడ్డి, కొంతం శ్రీనివాస్, సిత యాదగిరి, అత్కూరి వైకుంటాం, మీసా కిష్టవ్వ, వార్డు సభ్యులు, అఖిలపక్ష నాయకులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
