వర్ధన్నపేట . సాక్షి డిజిటల్ న్యూస్ . రిపోర్టర్. కుందూరు మహేందర్ రెడ్డి. జనవరి 26.వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్వర్యంలో మండల పార్టీ ఆఫీసులో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎర్రబెల్లి ఆ జాతీయ జెండాకు వందనం చేశారు. అంతకుముందు గాంధీజీ, అంబేద్కర్ చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం, ప్రజలే పరిపాలించుకునే సమాఖ్య స్ఫూర్తితో దృఢ విశిష్టమైన రాజ్యాంగం మనదని అన్నారు.ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. వారి మేధోకృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుంది ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ వర్ధిల్లుతుండటం మనందరికి గర్వకారణమని అన్నారు. అనంతరం ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తూల్ల. కుమారస్వామి, పట్టణ అధ్యక్షులు గోధుమల మధుసూదన్, మాజీ జడ్పీటీసీ మార్గం. భిక్షపతి, ఇన్చార్జి చింతల యాదగిరి, పోలపెల్లి రామ్మూర్తి, సిలువేరు కుమారస్వామి,తు మ్మలయకయ్యా, తోటకూర రాజమణి, ఎండి.అజీమ్, డివిజన్ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్లు, మాజీసర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, పట్టణ ముఖ్య కార్యకర్తలు,పార్టీ శ్రేణులు,ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
