సాక్షి డిజిటల్ న్యూస్ 27 జనవరి మహబూబాబాద్ జిల్లా గార్ల మండల రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు, జనవరి 26 గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మార్గదర్శకత్వంలో గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతి హతిరామ్ నాయక్ దివ్యాంగులకు 5 వీల్ చైర్లను వితరణ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ భానోత్ పార్వతి హతిరామ్ నాయక్ మాట్లాడుతూ, దివ్యాంగులకు ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య సహకారంతో దివ్యాంగులకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుండా వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ మహమ్మద్ జరీనా బేగం, వార్డు సభ్యులు,మరియు కందునూరి శ్రీనివాస్, రహీం, ఖదీర్, జిలాని, సీతారాములు, కోళ్ల కుమార్ గౌడ్, నాగరాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శి బానోత్ రమేష్ నాయక్, గ్రామపంచాయతీ సిబ్బంది పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.