సాక్షి డిజిటల్ న్యూస్ (కొండూరి ప్రకాష్)గంగారం జనవరి26:-విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన గంగారం మండల అధికారులకు జిల్లా స్థాయి గుర్తింపు లభించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించు కుని మహబూబాబాద్ జిల్లా యంత్రాంగం ప్రకటించిన 'ఉత్తమ ఉద్యోగుల' జాబితాలో గంగారం ఎస్ఐ రవికుమార్ మరియు ఎంపీడీవో వైష్ణవి ఎంపికయ్యారు.మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపిన ఎస్ఐ రవికుమార్ 'బెస్ట్ ఎస్ఐ' అవార్డుకు ఎంపికయ్యారు. ముఖ్యంగా ఆయన విధి నిర్వహణలో ప్రజలతో స్నేహపూర్వక(ఫ్రెండ్లీ పోలీస్)గా ఉంటూ, తనదైన శైలిలో ప్రజలకు రక్షణగా నిలవడమే కాకుండా, బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరిస్తూ అందరి ప్రశంసలు అందు కుంటున్నారు. అలాగే, బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో మరియు కార్యాలయ నిర్వహణలో తనదైన ముద్ర వేసిన ఎంపీడీవో వైష్ణవి 'బెస్ట్ ఎంప్లాయి'గా నిలిచారు. మహబూబా బాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో జిల్లా కలెక్టర్చేతుల మీదుగా వీరిద్దరూ ప్రశంసా పత్రాలను అందుకున్నారు.ఒకే మండలంలో ఇద్దరు అధికారులకు ఉత్తమ పురస్కారాలు దక్కడం పట్ల స్థానిక ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
