సాక్షి డిజిటల్ న్యూస్ 26 జనవరి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి, జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు నందయ్య, కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి నర్సింగరావు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా మేమే రాజులం,మేమే మంత్రుల అన్న అహంకార ధోరణితో పాలన చేసిందని తీవ్రంగా విమర్శించారు.ఫలితంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా సమస్యలే దర్శనమిస్తున్నాయని తెలిపారు. ప్రజలకు జవాబుదారీతనంతో పని చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బలంగా ఉందని, రాజకీయ సమీకరణల కారణంగా కొందరికి టిక్కెట్లు దక్కకపోయినా అందరూ పార్టీ గెలుపుకోసం సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ నాయకుల. వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని నిర్ణయించారు.