సాక్షి డిజిటల్ న్యూస్ – జనవరి 27 – సికింద్రాబాద్ – తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు సంబంధించిన విధి విధానాలను రూపొందించడంలో పూర్తిగా విఫలం చెందారు. కానీ ఈ రోజు కొత్త పాట పాడుతూ కొత్త కొత్త సర్కులర్లు విడుదల చేస్తూ తమ చేతగానితనాన్ని నిరూపించుకుంటున్నారు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మొదటినుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రిపోర్టర్లు అంటే అస్సలు గిట్టదు, అందుకోసమే చిన్న పత్రికలను ఇప్పటివరకు ఏం ప్యానల్ మెంట్ చేయలేదు. ఆయన ఒకప్పటి రిపోర్టర్ ఈరోజు రాష్ట్ర మంత్రి గా ఎదిగారు కానీ అధికారంలోకి రాగానే రిపోర్టర్లు అంటే ఆయనకు అస్సలు నచ్చడం లేదు. అందుకోసమే ఆయన అక్కాసు, కుళ్ళు కుతంత్రాలు తెలంగాణ రిపోర్టర్ల పైన వెల్లగక్కు తున్నాడు. గత ప్రభుత్వం ఎందుకు ఓడిపోయిందో తెలిసి కూడా ఆయన రిపోర్టర్లకు ఏం ఇయ్యాలో ఏం చేయాలో ఆయనకు ఏమాత్రం తెలియట్లేదు. అసలు సమాచార శాఖ మంత్రిగా ఆయన పూర్తిగా విఫలమ య్యాడు. ప్రతి రిపోర్టర్ కు న్యాయం చేసి అర్హత లేని రిపోర్టర్లకు చెక్ పెట్టే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి లేకపాయే. కానీ అక్రిడేషన్ కార్డు లేని వాళ్ళు బండ్లకు స్టిక్కర్లు పెట్టుకోవద్దు అంటున్నారు. అక్రిడేషన్ కార్డు నియమ నిబంధనలు ఎలా రూపొందించాలో అసలే తెలియదు. ఈ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డికి ఏమాత్రము తెలియదు. ఈ పదవి అడ్డం పెట్టుకొని ఆయనకు కావలసిన సొంత పనులు చేసుకుంటున్నారు. తెలంగాణ రిపోర్టర్లకు ఆయన 1 శాతం కూడా ఉపయోగపడడం లేదు అన్న ఆరోపణలు ఆయన ఆయన మీద ఉన్నాయి. ఏది ఏమైనా తెలంగాణలో రిపోర్టర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం శాపం గా మారింది. ఇప్పటికైన ఆర్ ఎన్ ఐ పత్రికలో పనిచేసే ప్రతి రిపోర్టర్ స్పందించి, ఈ వార్తను అన్ని గ్రూపులలో వేసి ప్రభుత్వానికి చేరే విధంగా చేసి రిపోర్టర్లు అంటే ఇలా ఉంటారు అని నిరూపించాలి.
