సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) పదరా మండల కేంద్రంలోని చిట్లంకుంట గిరిజన ఉద్యోగ సంఘం గ్రామస్తుల ఆపద సమయంలో ఆసరా నిలుస్తూ తనదైన శైలిలో సామాన్యులకు సహాయ సహకారాలు అందిస్తుంది తాజాగా గ్రామానికి చెందిన బిలావత్ గంగయ్య భార్య బిలావత్ లచ్చి ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి విషయం తెలుసుకున్న చిట్లంకుంట గిరిజన ఉద్యోగ సంఘం నాయకులు లచ్చి ఇంటికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చార్చి మృతురాలు కుటుంబానికీ 11000 వేల రూపాయిలు ఆర్థిక అందించారు లచ్చి ఆత్మకు శాంతి కలగాలని దుఃఖ సంతప్తులైన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బి రాములు నాయక్, కార్యదర్శి శంకర్ నాయక్, కోశాధికారి కె పాండు నాయక్,బి హన్మంతు నాయక్,బిలావత్ భీముడు తదితరులు పాల్గొన్నారు.