సాక్షి డిజిటల్ న్యూస్ / జనవరి 26 అడ్డగూడూరు రిపోర్టర్ నోముల ఉపేందర్, 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అడ్డగూడూరు మండలంలోని అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో శంకరయ్య, తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ శేషగిరిరావు, పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ ఈశ్వర్, వ్యవసాయ కార్యాలయంలో ఏఓ పాండురంగ చారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి భార్గవి, పశువైద్య కేంద్రంలో డాక్టర్ అనిల్ రెడ్డి, ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలలో ప్రధానో పాధ్యాయులు, గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, పలు పార్టీ కార్యాలయంలో ఆయా పార్టీల అధ్యక్షులు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, పలు రాజకీయ పార్టీల నాయకులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.