14వ వార్డులో గెలుపు ఖాయం-గుర్రాల స్వప్న శ్రీనివాస్

సాక్షి డిజిటల్ న్యూస్, 26 జనవరి 2026, సుల్తానాబాద్ మండల్ రిపోర్టర్ టి సంజయ్ : ఎవరెన్ని జమ్మికులు చేసిన గెలుపు ఖాయం అని గుర్రాల స్వప్న శ్రీనివాస్ ధీమా వ్యక్తంచేశారు. ప్రజల ఆశీస్సులతో మరోసారి కౌన్సిలర్గా గెలుపు దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ పరిధిలోని పూసాల 14వ వార్డులో ఎవరెన్ని జిమ్మిక్కులు చేసిన, మాయ మాటలు చెప్పి ప్రలోభాలకు గురిచేసిన, బి ఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుర్రాల స్వప్న శ్రీనివాస్ ను గెలిపించి తీరుతమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, గతంలో చేసిన అభివృద్ధి, సేవా భావం, మమ్మల్ని గెలిపిస్తుందని గుర్రాల స్వప్న శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు. 14వ వార్డు ప్రజలకు మరోసారి సేవ చేసే భాగ్యం కల్పిస్తున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటానని, ప్రజాసేవే లక్ష్యంగా 14వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని గుర్రాల స్వప్న శ్రీనివాస్ స్పష్టం చేశారు. 14వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీలు నిరంతర మంచినీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి కనీస అవసరాలు ప్రజలకు అందించడంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తామని, ఆదరించి అభిమానించి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రజాక్షేత్రంలో నిలబడి తాము ప్రజల కష్టసుఖాల్లో ఇప్పటివరకు తోడుగా ఉన్నామని తెలిపారు. నన్ను గెలిపిస్తే 14వ వార్డును అభివృద్ధి పథంలో తారస్థాయి చూపిస్తానని హామీ ఇచ్చారు.