వైద్య వృత్తికే వన్నె తెచ్చిన డాక్టర్జాఫర్

★చిరునవ్వుతో మంచి పలకరింపు

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 26 మణుగూరు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్, ఖన్న: వైద్య వృత్తిని కేవలం ఉపాధిగా కాక సేవగా భావించి, తనకున్న దానిలో పేదల బాధను పంచుకున్న మానవతావాది, చిరునవ్వుతో ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే సౌమ్య స్వభావి షేక్ జాఫర్ అకాల మరణం మణుగూరు ప్రజలకు తీరని లోటు. మణుగూరు రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్‌గా సేవలందిస్తూ, తరువాత హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్‌లో పనిచేసినా, తన ఊరు–ప్రజలపై ఉన్న ప్రేమను ఎప్పటికీ మరిచిపోని వ్యక్తి ఆయన. ఆయన అనారోగ్యంతో మృతి చెందడం ఎంతో బాధాకరం.
వైద్యుడిగా మాత్రమే కాకుండా, మంచి మిత్రుడిగా, మంచి మనిషిగా అనేక హృదయాలలో చెరగని ముద్ర వేసి వెళ్లారు. షేక్ జాఫర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు ఈ కఠిన సమయంలో భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాము.