రానున్న మున్సిపల్ ఎన్నికల్లో SC/ST, BC, మైనారిటీల ఓటు శక్తి కీలకం. మజిలీస్ పార్టీ మెట్టుపల్లి పట్టణ అధ్యక్షుడు అఖిల్.

(సాక్షి డిజిటల్ న్యూస్ మెట్పల్లి మండల్ రిపోర్టర్ షేక్ అజ్మత్ అలీ)26/1/26, మెట్పల్లిలో రాజకీయ చర్చలు ఉద్ధృతం రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మెట్పల్లి పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా SC/ST, BC, మైనారిటీ వర్గాల్లో ఓటు హక్కు, ప్రాతినిధ్యం, అభివృద్ధిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా ముస్లింలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాల సమస్యలను పట్టించుకోలేదన్న ఆరోపణలు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై వినిపిస్తున్నాయి. వాగ్దానాలు ఎన్నో చేసినా, ఆచరణలో మాత్రం మైనారిటీ సంక్షేమం, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో తగిన న్యాయం జరగలేదని స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికలు మైనారిటీలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు అత్యంత కీలకమని సామాజిక నేతలు పేర్కొంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటే అత్యంత శక్తివంతమైన ఆయుధమని, తమ హక్కులు, గౌరవం, భవిష్యత్ అభివృద్ధి కోసం ఓటును ఆలోచించి వినియోగించాల్సిన సమయం వచ్చిందని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ముస్లింలను నిర్లక్ష్యం చేసిన పార్టీలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పే అవకాశం ఇదేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ నుంచి వార్డ్ కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న మజ్లిస్ అభ్యర్థులపై మెట్పల్లి ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. మైనారిటీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీగా మజ్లిస్ గుర్తింపు ఉందని, స్థానిక సమస్యలను స్వరం లేపగల నాయకత్వం అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మైనారిటీ సోదరులు ఐక్యంగా ఆలోచించి, తమ హక్కులు, గౌరవం, అభివృద్ధిని కాపాడే నాయకత్వంపై నిర్ణయం తీసుకోవాల్సిన కీలక ఘట్టంగా ఈ ఎన్నికలను వారు చూస్తున్నారు. మెట్పల్లి చాలా వార్డ్ ల లో గెలుపు ఓటమి ఈసారి మైనారిటీ ఓటు నిర్ణయించనుందన్న చర్చ పట్టణమంతా జోరుగా సాగుతోతుంది.