సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 26 రిపోర్టర్ షేక్ సమీర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముస్లిం మైనారిటీ లకు వచ్చే నెల ప్రారంభం కానున్న రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ముస్లిం మైనారిటీ నాయకులు జూలూరుపాడు మండలం
జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో రంజాన్ మాసం ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నందున మసీదులు మరియు కబరస్థాన్ ల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అలాగే మసీదులకు విద్యుద్ దీపాలతో అలంకరించాలని, తగిన ఏర్పాట్లకు జిల్లా అధికార యంత్రాంగం సహకరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా సహెర్ , ఇఫ్తార్ సమయాల్లో అంతరాయం లేని విద్యుత్ మరియు మంచినీటి సరఫరా కల్పించాలని, ముస్లిం ఉద్యోగస్తులకు, నమాజ్ చేసుకునేందుకు తగిన సమయాభావ అవకాశాన్ని "అధికారులు" కల్పించాలి. అదేవిధంగా కళాశాలల్లో చదివే విద్యార్థిని, విద్యార్థులకు నమాజ్ చేసుకునేందుకు కళాశాల యాజమాన్యాలు తగిన సమయం మరియు వెసులుబాటు సౌకర్యాన్ని కల్పించాలని, ఆయన కోరారు.
అలాగే ప్రధానంగా ముఖ్యమైన భద్రాద్రి జిల్లా వ్యాపారాలు నిర్వహిస్తున్న ముస్లిం సోదరులకు రాత్రి వేళల్లో కొంత వెసులుబాటు సమయాన్ని "పోలీసు శాఖ"* వారి ఆంక్షలు లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలనీజూలూరుపాడు మండలం ముస్లిం మైనారిటీ షేక్ సమీర్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.