మార్చ్ ఫస్ట్ పెరేడ్ డ్రెస్సుల వితరణ అభినందనీయం

★రేకులపల్లి ప్రాథమిక పాఠశాలకు 13 వేల విలువగల స్కౌట్ డ్రెస్ ల వితరణ

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26, ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్, మార్చి ఫస్ట్ పెరేడ్ డ్రెస్సుల వితరణ అభినందనీయమని రేకులపల్లి సర్పంచ్ రాజేందర్ అన్నారు. స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణంలో 13 వేల విలువగల 10 స్కౌట్ డ్రెస్ లను బేతి సంపత్ కుమార్( శివ సాయి రైస్ మిల్ ) విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేష్ ఆర్థిక సహాయం అందించిన సంపత్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రశేఖర్ ఎనిమిదవ వార్డు సభ్యులు గంగాధర్ ఉపాధ్యాయులు శ్రావ్య గంగాధర్ సవిత,చందన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.