మానవ హక్కులను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలి– ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు

సాక్షి డిజిటల్ ప్రతినిధి, దుమ్మ, రాజు విలేకర్ జనవరి 26-1-2026, హైదరాబాద్: సమాజంలో ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే హక్కు మానవ హక్కుల మూల సూత్రమని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ (ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి) తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ 2026 క్యాలెండర్ ను ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యం నిలకడగా కొనసాగాలంటే మానవ హక్కుల పరిరక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, న్యాయం పొందే హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయని ఆయన గుర్తు చేశారు. అయితే సమాజంలో ఇప్పటికీ పేదలు, మహిళలు, బాలలు, దళితులు, గిరిజనులు, కార్మికులు, వృద్ధులు అనేక సందర్భాల్లో హక్కుల ఉల్లంఘనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మానవ హక్కులు.