బి.కొత్తకోట నగరపంచాయతి కమిషనర్ గా బి.రమాదేవి.

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి.25, బి.కొత్తకోటరిపోర్టర్ చక్రపాణి. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట మండలం బి.కొత్తకోట నగరపంచాయతి కమిషనర్ గా బి.రమాదేవి శనివారం భాద్యతలు చేపట్టారు ఇక్కడ కమిషనరు గా పనిచేస్తున్న జి.వి పల్లవి పదోన్నతి పై మదనపల్లికి వెళ్లగా .బి.కొత్తకోట నగరపంచాయతి లోఏవోగా విధులునిర్వహిస్తున్న బి.రమాదేవి ని కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేశారు. ఈసందర్భంగా కమీషనర్ రమాదేవి మాట్లాడుతూ బి.కొత్తకోట నగరపంచాయతి లో ఏవో గా విధులు నిర్వహిస్తు..ఇక్కడే కమిషనర్ గా భాద్యతలు చేపట్టడం సంతోషంగా ఉందాని. తనభాద్యత మరింత పెరిగిందని నగరపంచాయతి అభివృద్ధి కి తన శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు.నూతన కమిషనర్ రమాదేవి కి నగరపంచాయతి సిబ్బంది. అధికారులు. ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు,