సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26 కర్నూలు జిల్లా కౌతాళం మండలం, కౌతాళంలో ఆర్టీసీ బస్టాండ్ నందు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా సిఐ. అశోక్ కుమార్ అవ గాహన నిర్వహిం చారు. ఈ సందర్భంగా సిఐ. అశోక్ కుమార్ మాట్లాడుతు వాహనదారులు తప్పని సరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమా దాలకు దారితీస్తుందని హెచ్చరించారు. అతివేగం, తప్పుదారి ప్రయాణం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగు తున్నాయని తెలిపారు. ప్రజలు స్వచ్చందంగా నిబంధనలు పాటించి, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. హెడ్ కానిస్టేబుల్ సోమ్లా నాయక్, మద్దిలేటి, స్థానిక వాహన దారులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.