ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

★తాసిల్దార్ జయ జయ రావు

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 26 కోట మండల రిపోర్టర్ వెంకట కృష్ణయ్య: మండలంలోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోట మండల తహసిల్దార్ జయ జయ రావు పేర్కొన్నారు. ఆదివారం తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ జయ జయ రావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమన్నారు. ఓటు ప్రాధాన్యత, దాని విలువను గురించి వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఓటరు కీలక పాత్ర వహిస్తాడు అన్నారు. అర్హుడైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మండలంలో ముగ్గురు సీనియర్ సిటిజన్స్ ను సన్మానించారు. సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జై జై రావు, వీఆర్వోలు, వీఆర్ఏలు, సచివాలయ సిబ్బంది, బిఎల్వోలు ,తదితరులు పాల్గొన్నారు.