
సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26, ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్, ప్రాథమిక పాఠశాల రేకులపల్లిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రాజేందర్ గారు ఉప సర్పంచ్ చంద్రశేఖర్ గారు మరియు 10 మంది వార్డు సభ్యులు కరుణాసాగర్ సుమలత వనిత సత్యనారాయణ లత సావిత్రి దాసు గౌడ్ , ధర్పల్లి గంగాధర్, మహిపాల్ కన్నతల్లి లాంటి ఊరు బడి రుణం తీర్చుకున్నారు. పాఠశాలకు రంగులు వేయించి అందంగా తీర్చిదిద్దారు. మా పాఠశాల రూపురేఖలు మార్చి అందంగా తీర్చిదిద్దిన అందరికీ పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.