సాక్షి డిజిటల్ న్యూస్- జనవరి 26- సికింద్రాబాద్- పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ బ్రాహ్మణ బస్తీలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ సామల హేమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ కాల్స్, లింక్‌ల ద్వారా జరిగే మోసాల విషయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌లు వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.పోలీస్ శాఖ చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఉందని డాక్టర్ హేమ పేర్కొన్నారు. సైబర్ నేరాల నివారణకు పోలీస్ శాఖ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు.అడిషనల్ డీసీపీ నర్సయ్య మాట్లాడుతూ డిజిటల్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. బ్యాంక్ అధికారులు పోలీసులమని చెప్పి వచ్చే కాల్స్‌ను నమ్మవద్దని, ఎవరూ కూడా ఫోన్ ద్వారా ఓటీపీ లేదా పిన్ నంబర్ అడగరని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే నకిలీ లింక్‌లు, లాటరీలు, ఉద్యోగ అవకాశాల పేరిట జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నర్సయ్య , ఎసిపి శశాంక్ రెడ్డి ,సిఐ అనుదీప్ ,బ్రాహ్మణ బస్తీ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర శర్మ, స్థానికులు తదితరులు పాల్గొన్నారు