పిన్నెల్లి గ్రామానికి చెందిన కీ.శే మందా సాల్మన్ పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్న యర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26 - 2026 (యర్రగొండపాలెం ఆర్ సి ఇంచార్జ్ ) రాము G, ఎమ్మెల్యే మాట్లాడుతూ
మందా సాల్మన్ గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మందా సాల్మాన్ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ విధించటం జరిగింది. దాదాపుగ 18 నెలలు గ్రామం నుండి బయటే ఉండటం జరిగింది. సంక్రాంతి పండుగ అంటే అందరూ వారి వారి కుటుంబాలతో కలిసి చాలా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ. అయితే అదే పండుగ రోజున మందా సాల్మన్ని పొట్టన పెట్టుకుంది ఈ కూటమి ప్రభుత్వం. దీనిని ఖచ్చితంగా ప్రభుత్వ హత్య గానే పరిగణించాలి. ఎవరైతే పోలీసులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారో అటువంటి పోలీసులుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మందా సాల్మన్ కుటుంబానికి అండగా ఉంటుందని మా నాయకుడు జగన్ అన్న భరోసా ఇవ్వటం జరిగింది అని తెలియజేశారు.