పారదర్శకంగా రామలింగేశ్వర స్వామి ఆలయ టెంకాయ వేలం

★​రామేశ్వరం ఆలయ అభివృద్ధికి టెండర్ల ఆదాయం: ★35లక్షలకు టెండర్ కైవసం చేసుకున్న గంట్లవెల్లి యాదయ్య

సాక్షి డిజిటల్ న్యూస్, 26/జనవరి/2026, ​షాద్‌నగర్ రిపోర్టర్/కృష్ణ, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం టెంకాయల విక్రయ హక్కుల కోసం బహిరంగ వేలం (టెండర్) నిర్వహించారు. దేవాదాయ శాఖ నిబంధనల మేరకు అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ వేలంలో యాదయ్య అనే వ్యక్తి రూ. 35 లక్షలకు టెండర్‌ను దక్కించుకున్నారు.
​దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ మోహన్, దేవాలయ ఈఓ శివకుమార్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, భక్తులు మరియు వ్యాపారుల సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగింది. ​01 ఫిబ్రవరి 2026 నుండి 31 జనవరి 2027 వరకు టెండర్ కలపరిమితి ఉంటుంది. ​టెండర్ దక్కించుకున్న వారు 48 గంటల్లోపు 50 శాతం మొత్తాన్ని, మిగిలిన 50 శాతాన్ని 90 రోజుల్లోపు చెల్లించాలి. ​ నిర్ణీత సమయంలోగా సొమ్ము చెల్లించని యెడల షాపును సీజ్ చేసి, కట్టిన సొమ్మును జప్తు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ​"టెండర్ ద్వారా వచ్చే ప్రతి రూపాయిని ఆలయ అభివృద్ధి పనులకే ఖర్చు చేస్తాం. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారమే ఈ ప్రక్రియను పూర్తి చేశాం."
​ఈ కార్యక్రమంలో రామేశ్వరం సర్పంచ్ మానస సురేష్, మాజీ సర్పంచ్ సంపత్ కుమార్, మాజీ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, మోహన్ రెడ్డి, మిలటరీ వెంకట్ రెడ్డి, అశన్నగౌడ్ మరియు పలువురు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు…