పల్లంకుర్రులో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాలనీ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు
ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకుర్రు గ్రామంలో గ్రామ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో ₹1.35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడనున్న సీసీ రోడ్లు మరియు విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధిని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. సీసీ రోడ్లు నిర్మాణంతో గ్రామంలో రవాణా సౌకర్యం మెరుగుపడి ప్రజలకు సులభతర ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణంతో గ్రామ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు మరింత దగ్గరగా అందుతాయి. ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఓగురి భాగ్యలక్ష్మి, ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, నాగిడి నాగేశ్వరావు, చెల్లి సురేష్, నడింపల్లి సుబ్బరాజు, కాశి శ్రీనివాసరావు, బడుగు పుల్లారావు, వెంట్రు సుధీర్, ఇసుకపట్ల వెంకటరమణ, మెల్లం సువర్ణ జ్యోతి, గెడ్డం చంద్రశేఖర్, పులుగు సురేంద్రబాబు, వరసాల రాంప్రకాష్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా… ప్రజల సౌకర్యమే ధ్యేయంగా పనిచేస్తున్న దాట్ల సుబ్బరాజు కృషిని ప్రజలు కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *