సాక్షి డిజిటల్ న్యూస్ - జనవరి 26- సికింద్రాబాద్ - యువత శారీరక, మానసిక వికాసాన్ని కలిగి ఉండాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. నామాలగుండు ప్రాంతంలో కొత్తగా నెలకొల్పిన ‘జే. ఎన్. ఫిట్ అండ్ జిమ్ ‘ ను పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధునాతన జిమ్ లకు సికింద్రాబాద్ కేంద్రంగా మారుతోందని అన్నారు. నిర్వాహకుడు శ్రీకాంత్, యువ నేత రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సమ్మక్క కు ప్రత్యేక పూజలు చిలకలగూడ లో బీ. ఆర్. ఎస్. నేత సతీష్ తదితరులు నిర్వహించిన సమ్మక్క పూజకు సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువ నేత రామేశ్వర గౌడ్ తో పాటు పెద్ద సంఖ్యలో బీ. ఆర్. ఎస్. నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పత్రాల మంజూరు లాలాపేట వినోభనగర్ ప్రాంతానికి చెందిన వేముల రాజేశ్వరి అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్సకు రూ. లక్షన్నర మేరకు నిధులను సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుళ్ళ పద్మారావు గౌడ్ మంజూరు చేయించి శనివారం మోండా మార్కెట్ లోని తన నివాసంలో ఎల్. ఓ. సి. పత్రాలను రాజేశ్వరి కుటుంబ సభ్యులకు అందించారు.