తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటి స్కూల్ నందు ఐదవ తరగతి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ అనూష తెలిపారు

సాక్షి డిజిటల్ న్యూస్, 26/జనవరి/2026, షాద్ నగర్ రిపోర్టర్/కృష్ణ, నాగులపల్లి రోడ్ నందు మైనార్టీ గురుకుల విద్యాలయంలో విద్యను అభ్యసించేందుకు ఆన్లైన్లో దరఖాస్తు నమోదు చేసుకోవాలని స్కూల్ ప్రిన్సిపల్ అనూష, మైనార్టీ నాయకులు కలిసి బ్యానర్, పాంప్లెట్స్ ని ఆవిష్కరించారు. ఆసక్తి గల విద్యార్థులు ఐదవ తరగతి కై తమ పేర్లను టీజియం తెలంగాణ సిజిజి. జిఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని ప్రకటనలో సూచించారు. ఈ కార్యక్రమంలో మదీనా మస్జిద్ ఇమామ్ , అబ్దుల్ హమీద్, మదీనా ఛానల్ సాబీర్, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.