సాక్షి డిజిటల్ న్యూస్: 26 జనవరి, పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని(జనవరి 25) పురస్కరించుకుని ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రారంభించి, సైకిల్ తొక్కారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి రామచంద్ర డిగ్రీ కళాశాల వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, యువత పాల్గొని "ఓటు మన హక్కు "అంటూ నినాదాలు చేశారు.