సాక్షి,, డిజిటల్ న్యూస్, శంకరపట్నం, కరీంనగర్ జిల్లా, సీనియర్ జర్నలిస్టు, బుర్ల రాజు,, కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు సేఫ్టీ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ మమేలా సత్పతి, అధ్యక్షతన జరిగిన ,సమీక్ష సమావేశంలో స్థానిక కేశవపట్నం రోడ్డు వెడల్ప పై చర్చ కొనసాగింది,, సంవత్సరాలు తరబడి కేశవపట్నం గ్రామ గ్రామంనకు,వెళ్లే రోడ్డు సక్రమంగా లేకపోవడంతో వాహనాదారులు ఇబ్బందులకు గురవుతున్నట్లు స్వయంగా అధికారులు ప్రస్తావించడం జరిగింది,, ఇందుకు రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపడితే కరీంపేట మొగిలిపాలెం వెళ్లేందుకు వాహనాలకు సులభతరంగా ఉంటుందని అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తేవడంతో ఆమె వెంటనే స్పందించారు,, ప్రజల అభిప్రాయం మేరకు రోడ్డు వెడల్పు కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేయుటకు తగు చర్యలు చేపట్టాలని కిందిస్తాయి అధికారులను కలెక్టర్ ఆదేశించారు, సమీక్ష సమావేశంలో ముఖ్యంగా పల్లెల్లో రోడ్ల సమస్యలు, తదితర అంశాలపై ప్రస్తావించారు.