కామారెడ్డి అభివృద్ధిని విస్మరించిన ఎమ్మెల్యే ని లదీయాల్సిన సమయం వచ్చింది షబ్బీర్ అలీ…

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26 కామారెడ్డి జిల్లా ప్రతినిధి మహమ్మద్ నయీమ్.. ​కామారెడ్డి పట్టణ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని 19, 42, 43, 48 మరియు 49వ వార్డులలో సుమారు రూ. 2.5 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్లు, సిసి రోడ్లు, కల్వర్టుల నిర్మాణంతో పాటు, అమృత్ పథకం కింద తాగునీటి పైపులైన్ల విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ ​పట్టణ అభివృద్ధిపై నిర్లక్ష్యం. ​కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపిస్తే, కామారెడ్డిలో ఎమ్మెల్యే పట్టణ అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం కంటే రాజకీయ ప్రయోజనాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది, ప్రజా ప్రతినిధిగా అందరినీ సమదృష్టితో చూడాల్సింది పోయి, ఆయన కేవలం ప్రోటోకాల్ కులాలు, మతాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఒక ఎమ్మెల్యేకు తగదు. ​కేంద్రం నుండి నయాపైసా తేలేదు ​కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, కామారెడ్డి పట్టణ అభివృద్ధికి అర్థ రూపాయి కూడా ఆయన తీసుకురాలేదు. తాను చేసిన పనులు, సాధించిన అభివృద్ధిని చూయించి ఓట్లు అడగాలి కానీ, అభివృద్ధి చేయకుండా ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ప్రజలు ఆయన డ్రామాలను గమనిస్తున్నారు. ఓట్లు అడగడానికి వస్తే నిలదీయండి. ​ఎన్నికల సమయంలో సొంత నిధులతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని గొప్పలు చెప్పారు. సొంత నిధులతో చేస్తా అన్న అభివృద్ధి ఎటు పోయిందో మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రజలంతా ఆయనను నిలదీయండి
మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపాలని ప్రజలు ప్రశ్నించాలి. ​ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *