సాక్షి, డిజిటల్ న్యూస్, జనవరి 26, 2026,( రిపోర్టర్ ఇమామ్ ), గ్రామాలలో ఉండే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని మరికల్ మండల తాసిల్దార్ రామకోటి అన్నారు ఆదివారం నాడు మరికల్ మండల కేంద్రంలో ఉద్యోగస్తుల విద్యార్థుల ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించు కొని మరికల్ గ్రామంలోని ప్రతి వార్డులలో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మరికల్ మండల తాసిల్దార్ రామకోటి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన. మనిషికి ఒక ఆయుధమని ఆయన వివరించారు. జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తాసిల్దార్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామంలో ఉన్న సీనియర్ ఓటర్కు శాలువాతో సన్మానించారు. మరికల్ గ్రామ సర్పంచ్ చెన్నయ్య ఉపసర్పంచ్ కాజా, మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరన్న, మరికల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్, వివిధ శాఖల అధికారులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు, మణికంఠ జూనియర్ కళాశాల యువకులు, వార్డు సభ్యుల, సురిటి చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.