సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26 రామకుప్పం రిపోర్టర్ జయరాంరెడ్డి చిత్తూరు జిల్లా, ఓటు ప్రతి ఒక్కరి హక్కుగా భావించాలని తాసిల్దార్ కౌలేష్ పేర్కొన్నారు ఆదివారం ఓటు దినోత్సవ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద మానవహారం నిర్వహించారు అనంతరం ప్రతిజ్ఞ చేసి ఓటును ప్రతి హక్కుగా భావించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఓటు లేని వారు ఓటు హక్కు పొంది విధిగా ఓటును వినియోగించుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరిలో ఓటు పై అవగాహన కలిగి ఉండాలని ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటరమణ క్లస్టర్ ఇంచార్జ్ రవి రెడ్డి ఐ టి డి పి భాస్కర్ ఆదిల్ తదితరులు పాల్గొన్నారు.