అడ్డగూడూరులో రాష్ట్రస్థాయి ద్వితీయ కబడ్డీ క్రీడోత్సవాలను ప్రారంభించిన ఎంఈఓ సబిత

సాక్షి డిజిటల్ న్యూస్/ జనవరి 26 అడ్డగూడూరు రిపోర్టర్ నోముల ఉపేందర్. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో క్రీస్తు శేషులు కత్తుల లింగరాజు యాదవ్ జ్ఞాపకార్ధకంగా తనతో పాటు చదువుకున్న 2016- 17 ఎస్ఎస్సి బ్యాచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ద్వితీయ కబడ్డీ క్రీడోత్సవాలను అడ్డగూడూరు ఎంఈఓ సబిత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈనెల 24 నుండి 26 వరకు కబడ్డీ పోటీలను నిర్వహిస్తామన్నారు.ప్రథమ బహుమతి 20000/-, ద్వితీయ బహుమతి 15000/-, తృతీయ బహుమతి 12000 /-, చతుర్థి బహుమతి 10,000/-, పంచమి 8000/- రూపాయలు నగదు, ట్రోఫీ ఇవ్వనట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు సర్పంచ్ వనజ సైదులు, ఎంపీ ఓ ప్రేమలత, ఉప సర్పంచ్ వరిగడ్డి లోకేష్, బైరెడ్డి సందీప్ రెడ్డి, కడారి రమేష్, గజ్జల్లి రవి ,షేక్ సమీర్, పయ్యావుల రమేష్, దాసరి బాలరాజ్,గుజ్జ మత్యగిరి, మహేష్, భరత్, కబడ్డీ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.