అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఎం ఎల్ ఎ సంజయ్ కుమార్ ఆర్ధిక సహాయం రెవిన్యూ డిపార్ట్మెంట్ తో మాట్లాడి న్యాయం చేస్తా అని హామీ

సాక్షి డిజిటల్ న్యూస్ 26 జనవరి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి, జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీకి చెందిన పాలిక కమలాకర్ కిరణా షాపు షాట్ సర్క్యూట్ తో ధ్వంసం కాగా పాలిక కమలాకర్ కుటుంబ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో కలిసి నష్టపరిహారం అందించాలని కోరగా స్పందించిన ఎమ్మెల్యే తక్షణ సాయంగా 5వేల రూపాయలను అందజేసి,కలెక్టర్,రెవెన్యూ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి న్యాయం జరిగే విధంగా చూస్తానని ,కరుణాకర్ కుటుంబానికి అండగా ఉంటామని, మున్సిపల్ తరపున స్ట్రీట్ వెండర్ షెడ్డు నిర్మాణానికి చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. అర్బన్ హౌసింగ్ కాలని లో మౌలిక సదుపాయాలు కల్పన కోసం అనునిత్యం కృషి చేస్తా ముఖ్యమంత్రి కృషితో 34 కోట్ల తో వాటర్ ట్యాంక్,సెప్టిక్ ట్యాంక్,కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేయటం జరిగింది. 520 ఇండ్లలో డ్రైనేజీ సమస్య,రహదారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు
మున్సిపల్ ఎన్నికల్లో తాను బలపరిచే ప్రభుత్వ పక్షాన ఉన్న అభ్యర్థుల గెలుపు కృషి చేయాలని ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ హౌసింగ్ కాలనీకి చెందిన శెట్పల్లి కిషన్ సుమన్ రవి ముజాహిద్ శ్రీను మల్లన్న పట్టణ నాయకులు శరత్ రావు, మహేష్, జంగిలి శశి, తదితరులు పాల్గొన్నారు.