అంబేద్కర్ అనుసరించిన మార్గం ఎప్పటికీ అనుసరణీయమేనని

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ భైరం నారాయణ 26 జనవరి 2026, గొల్లపెల్లి మండల కేంద్రంలో సామాజిక సేవ కార్యకర్త గంగాధర మధుసూదన్,ఆధ్వర్యంలో గౌరవ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామ స్మరణ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిధిగా గౌడ సంఘం అధ్యక్షులు గుండా గంగాధర్ పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళిలు అర్పించారు.ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు గుండా గంగాధర్ మాట్లాడుతూ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం,కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి, ఆయన సేవలు ప్రపంచానికే ఆదర్శనీయం అంబేద్కర్ అనుసరించిన మార్గం ఎప్పటికీ అనుసరణీయమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు పల్లె నలగొండం,సాయిలు గౌడ్, మునిగళ్ళ శేఖర్, చెరుకు మల్లేష్,మునిగళ్ళ తిరుపతి, గుండా గంగాధర్,గుండ వెంకటేష్,మునిగళ్ళ నరేష్, కరబుజ మహేష్, గ్రామస్తులు చిర్ర దిలీప్ న్యాయవాది,శాలివాహన కుమ్మర సంఘం మండల అధ్యక్షుడు సిరికొండ తిరుపతి, నక్క విజయ్, సామాజిక కార్యకర్త సాతల లక్ష్మణ్, జంగలి శ్రీనివాస్, జేరిపోతుల అంజయ్య, సామజిక సేవ కార్యకర్త గంగాధర మధుసూదన్, గ్రామస్థులు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.