
(సాక్షి డిజిటల్ న్యూస్ మెట్ పల్లీ మండల్ రిపోర్టర్ షేక్ అజ్మత్ అలీ) 25/1/2026 మెట్పల్లి పట్టణంలోని వ్యాపారులకు శనివారం ఉదయం సైబర్ నేరగాళ్ల నుంచి కాల్స్ వస్తున్నాయని వ్యాపారస్తులు పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు మేము మీ పక్కా షాప్ నుంచి లేదా ఎదురుగా ఉన్న దుకాణం నుంచి ఫోన్ చేస్తున్నామని చెబుతూ ఈరోజు ఈఎంఐ కట్టడానికి 7000 పంపాల్సిందిగా కోరాడని అన్నారు ఫోన్ వచ్చిన నెంబర్ సదరు వ్యాపార యజమానిది కాకపోవడంతో సైబర్ కాల్ గా గుర్తించడం జరిగినది. ఇలా ఈ నెంబర్ నుంచి ఒకరి కాదు ఇద్దరు కాదు చాలామందికి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇది సైబర్ నేరంగా గ్రహించిన చందన లేడీస్ ఎంపోరియం ప్రోప్రైటర్ గుంటుక అనిల్ కుమార్ ఈ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తే వ్యాపారస్తులు మరియు మెట్పల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పై తెలిపిన నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు సమాధానం ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. (+91 8520034390).