20 మంది చేనేత కార్మికులకు రూ.14 లక్షలు రుణమాఫీ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే సామేలు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్, మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఇక్కత్ హ్యాండ్లూమ్ క్లస్టర్ లో 20 మంది చేనేత కార్మికులకు రూ.14 లక్షల చేనేత రుణమాఫీ చెక్కులను ఎమ్మెల్యే సామేలు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని ప్రగల్బాలు పలికిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా కూడా రుణమాఫీ చేయలేదని విమర్శించారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రుణమాఫీ చేయడం హర్షనీయమన్నారు.రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత కార్మిక రంగం అతిపెద్దదని, సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పరుస్తుందన్నారు. చేనేత కార్మికుల ఆకలి చావులకు కాంగ్రెస్ ప్రభుత్వం దారి చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడిఈ శ్రీనివాసరావు, తహసిల్దార్ జ్యోతి,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఫైళ్ల సోమిరెడ్డి,జిల్లా నాయకులు డా.గుర్రం లక్ష్మీనరసింహ రెడ్డి, అవిశెట్టి అవిలిమల్లు,మార్కెట్ డైరెక్టర్ పోచం జగన్, సొసైటీ మేనేజర్ వేముల నరసయ్య, చేనేత సంఘం నాయకులు పోచం బిక్షపతి, పోచం కన్నయ్య,తాటి కరుణాకర్, జల్ది రాములు, మహేశ్వర వెంకటేశ్వర్లు, కొక్కుల సత్యనారాయణ, కూరపాటి రాములు, గుండు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.