16 వార్డుకు సై అంటున్న అన్వర్ పాషా

సాక్షి డిజిటల్ న్యూస్ వైరా జనవరి 25/2026, ఖమ్మం జిల్లా వైరా చిలుము ఉపేందర్ రావు పల్లిపాడు, రానున్న వైరా మున్సిపాలిటీ త్వరలో జరగనున్న ఎన్నికలలో 16 వ వార్డ్ కు పోటీ చేసేందుకు సై అంటున్న షేక్ అన్వర్ పాషా. ఈసారి బీసీ జనరల్ రావడంతో యువత పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు, ఇతను ముస్లిం మైనార్టీ చెందిన bc బిడ్డగా గుర్తించారు. ప్రజలకు కూడా చేదోడు వాదోడుగా వారి యొక్క అవసరాలను తీరుస్తూ తనకున్న మంచితనాన్ని చాటుతు 16 వార్డుకు పోటీ చేసేందుకు ముందు అడుగు వేస్తున్నారు. ఓటర్లు కూడా యువత వైపే మొగ్గు చూపుతున్నారు, ప్రజలు కూడా గెలుపు గుర్రాల వైపే చూస్తున్నారు. ప్రజల అభిమానం ఆశీర్వాదంతో. ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం తనకు ఇవ్వాలని కోరుతున్నారు. ఇ సారి అందరూ కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు, సో దాని కోసం అందరు కూడా క్షేత్ర స్థాయిలో గట్టి పోటీ ఇచ్చెందుకు సై అంటున్నారు… ఈ రాచరిక, అన్యాయ అక్రమ పాలనకి స్వస్తి చెప్తు రాజ్యాంగం కి అనుగుణంగా పని చేసే యువత ముందుకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.