స్వంత ఖర్చులతో బిజ్వారం గ్రామ అభివృద్ధికై – సర్పంచ్ వై.శైలజా శ్రీనివాస్ రెడ్డి కృషి అద్వితీయం

★హర్షం వ్యక్తం చేస్తూ,అభినందనలు తెలియజేస్తున్న బిజ్వారం గ్రామ ప్రజలు

సాక్షి డిజిటల్ న్యూస్ 25 మల్దకల్ మండలం రిపోర్టర్ ఎన్ కృష్ణయ్య. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలంలోని బిజ్వారం గ్రామంలో సర్పంచ్ వై.శైలజ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీలో నిధులు లేకున్నా కానీ తమ స్వంత ఖర్చులతో గ్రామ పంచాయతీ భవనానికి ప్రత్యేక పెయిటింగ్ రంగులు వేయించి ముస్తాబు చేయించారు.గ్రామ ప్రజల కోరికమేరకు గ్రామంలోని 12 వార్డులలో అన్ని విద్యుత్ స్తంభాలకు ప్రత్యేక ఎల్ఈడి లైట్ల ను వేయించారు.అదేవిధంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా ప్రధాన ఏరియా అంబేద్కర్,వైఎస్సార్ చౌరస్తాలో వున్న విద్యుత్ స్థంబాలకు చూపరులను ఆకట్టుకునే విధంగా త్రివర్ణ జాతీయ జెండా కలర్ లో విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయించారు.ఈ సందర్భంగా సర్పంచ్ వై.శైలజ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ….బిజ్వారం గ్రామాన్ని గ్రామ పెద్దల సహకారంతో అన్ని రంగాలలో గ్రామాన్ని అభివృద్ధి పరచడమే మా ముందున్న లక్ష్యమని అన్నారు. భవిష్యత్తులో మరెన్నో పనులు చేపడుతూ, గ్రామ ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే మా కోరిక అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి బసిరెడ్డి, టి.కృష్ణమూర్తి, రాగిమాన్ శ్రీనివాస్ రెడ్డి, జె.సిద్దయ్య, మాజీ సర్పంచ్ బి.కృష్ణ, చిన్న బాల సాహెబ్,వార్డ్ మెంబర్ హరీన్, కర్రెన్న, చాపకండ్ల అంజి,ఎస్.నాగేంద్ర, ఎస్.రాజు, ఎస్.విజయ్ తదితరులు పాల్గొన్నారు