సాక్షి డిజిటల్ న్యూస్ 25 జనవరి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, మండలంలోని పెదనందిపల్లి గ్రామంలో కొలువైయున్న వీర వెంకటసత్యనారాయణ స్వామిని మాడుగుల శాసన సభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి శనివారం దర్శించుకున్నారు ఉదయం స్వామివారికి ధూప దీప నైవేద్యాలతోపాటు ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి నిర్వహించారు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల పరుగుల ప్రదర్శన నిర్వహించారు గెలుపొందిన విజేతలకు బహుమతులు బహుమతులు అందజేశారు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు మాజీ శాసనసభ్యులు గవిరెడ్డి రామానాయుడు మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పెద్దాడ వెంకటరమణ రైవాడ జలాశయం చైర్మన్ పోతల పాత్రు నాయుడు టిడిపి మండల ప్రధానకార్యదర్శి దొగ్గ దేవుడునాయుడు మాజీ ఎంపీటీసీ లింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు స్థానిక ఎటువంటి అవాంఛ నియా సంఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక ఎస్సై వి సత్యనారాయణ తన సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు.