
సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25, ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్, ధర్పల్లి మండల కేంద్రంలోని మున్నూరు కాపు గురిజాల చట్టం సభ్యులు నిర్మించుకున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం నాలుగో వార్షికోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు, స్వామి వారి దేవాలయం వద్ద పూజా కార్యక్రమాలు హోమము కళ్యాణం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు, వందలాదిమంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు ప్రతి సంవత్సరం గురిజాల మునుర్కాబ్ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గురిజాల గంగాధర్, గురిజాల లింబాద్రి, గురిజాల బుచ్చన్న, మరియు కుల సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.