శాంతినివాస్ అనాథాశ్రమంలో సేవా కార్యక్రమాలు..

సాక్షి డిజిటల్ న్యూస్, ( విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం తాలుకా రిపోర్టర్ ఇనుముల సింహాచలం) బొండపల్లి : మండలంలోని ఒంపల్లి దగ్గరలోగల శాంతినివాస్ అనాథశ్రమంలో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశ్రమంలోని పిల్లలకు స్నాక్స్ ఐటమ్స్,పోషకాహారం కోసం గుడ్లు,ఆడపిల్లలకు చెప్పులను పంపిణీ చేయడం జరిగింది.ఫౌండేషన్ సభ్యుడు చందన్ కిషోర్,తన తల్లి జ్ఞాపకార్ధంగా, ,ఆయన సౌజన్యంతో ఈ కార్యక్రమం చేసినట్లు ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాయి కుమార్,రేవంత్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ " ఫౌండేషన్ సభ్యుల పుట్టినరోజుల నాడు అనాథ, వృద్ధాశ్రమాలలో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు బొత్స చినతల్లి, ఆశిక్,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.