సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద జనవరి 25, హొళగుంద జగనన్న కాలని నుంచి విద్యుత్ శాఖాధికారులు తీసుకెళ్లి పోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తిరిగి అక్కడే బిగించాలని జగనన్న కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం హొళగుందకు చెందిన లబ్దిదారులు నాగరాజు, తిమ్మప్ప, మహాదేవ, ముదుకప్ప, వీరేశ్ తదితరులు జగనన్న కాలనిలోని ట్రాన్హ్ఫార్మర్లను విద్యుత్ శాఖాధికారులు తీసుకెళ్లడంతో ఖాళీగా ఉన్న కట్టలను. నిర్మాణంలో ఉన్న ఇళ్లను వారు చూపించారు 217 సర్వే నంబరులోని 18 ఎకరాల్లోని జగనన్న కాలనిలో 720 మంది లబ్దిరులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చెయగ అందులో కొన్ని ఇళ్లు పూర్తయి నివాసం ఉంటుండగ ఇంకా చాల మేర ఇంటి నిర్మాణాలు జరుగు తున్నాయని చెప్పారు. కాలనిలో 6 వరకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారని అయితే వాటిలో విద్యుత్ శాఖాధికారులు ఒకటిని మాత్రమే ఉంచి మిగిలిన 5 ట్రాన్స్ఫార్మర్లను తీసుకెళ్లిపోవడంతో ఖాళీ కట్టలు మాత్రమే మిగిలాయని తెలిపారు. దీనివల్ల కాలనీలో ఇంకా నిర్మాణాలు జరుగుతున్న వాటికి నీటిని క్యూరింగ్ చెయడానికి ఇతర అవసరాలకు విద్యుత్ సమస్య నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని పై సిబ్బందిని ప్రశ్నించిన ఎవరు పట్టించు కోవడం లేదని వాపోయారు. వేరే చోటుకు తరలించిన ట్రాన్స్ ఫార్మర్లను వెంటనే తిరిగి జగనన్న కాలనిలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు