వద్దిరాజు రవిచంద్ర జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 25 రిపోర్టర్ షేక్ సమీర్ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శాసనమండలి సభ్యులు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్ , సత్తుపల్లి మాజీ సీనియర్ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరివెంట వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.