లేబర్ కార్డు మంజూరులో అక్రమాలు రంగంలోకి దిగిన ఎసిబి

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 2026 అనంతగిరి మండల రిపోర్టర్ గరిడేపల్లి రమేష్, కోదాడ పట్టణంలోని లేబర్ కార్యాలయంలో అనూహ్యంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లేబర్ కార్డుల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని సమాచారంతో శనివారం రోజున లేబర్ కార్యాలయంలో సోదాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అవకతవకలకు చెక్ పెట్టేదిశగా అధికారులు సమాచారంతో సోదాలు నిర్వహించారు. పట్టణంలోని ఓ మీసేవ కేంద్ర ఆధారంగా లేబర్ కార్డులో అవకతవకలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు. దీనికి సంబంధించిన రికార్డులు మొత్తాన్ని లేబర్ కార్యాలయంలో పరిశీలించడం జరిగింది. ఈ సోదాల్లో కీలకమైన అధికారిక ధ్రువపత్రాలు, అధికారిక దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అక్రమ లావాదేవీలకు సంబంధించిన మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏసీబీ అధికారులు ఇంకా విచారణ కొనసాగుతుంది అని తెలపడం జరిగింది.