సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 25 రొంపిచర్ల మండలం, రిపోర్టర్ భీమనేని బాలకృష్ణ, రొంపిచర్ల మండలం లోని ఆకాష్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో వసంత పంచమి రోజున అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పూజారి విచ్చేసి గణపతి పూజ, సరస్వతీ పూజ, అక్షరాభ్యాస కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలతో హాజరై తమ పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పూజారి ఆశీస్సులతో దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు పాల్గొన్నారు.